ఓటర్ కార్డులో మీ అడ్రస్ ని మార్చుకోవాలంటే ఇలా చెయ్యండి..!

-

ఓటర్ కార్డు ఓటు వెయ్యడానికి అవసరం. అలానే కొన్నింటికి దానిని ప్రూఫ్ కింద కూడా వాడుకోవచ్చు. అయితే ఓటరు కార్డు ఓటు హక్కు వచ్చిన వాళ్లందరికీ ఉంటుంది. మీకు కూడా ఓటర్ కార్డు ఉందా..? దానిలో మీరు మీ యొక్క అడ్రస్ ని మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు దీనిని చూడాలి.

అప్పుడు మీరు ఎంతో ఈజీగా ఓటర్ కార్డు లో అడ్రస్ ని మార్చుకోవడానికి అవుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఓటర్ కార్డు లో అడ్రస్ ని మార్చుకోవాలంటే ఈజీగా ఎవరైనా మార్చేయచ్చు. పైగా దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. జస్ట్ ఒక స్మార్ట్‌ఫోన్ మీ వద్ద ఉంటే సరిపోతుంది. ఈజీగా అడ్రస్ మార్చుకోవచ్చు.

ముందుగా దీని కోసం మీరు https://www.nvsp.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
నెక్స్ట్ మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి వుంది.
లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు మీకు ఎడమ చేతి వైపున ‘కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటైల్స్’ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చెయ్యండి.
ఇక్కడ మీకు మూడో ఆప్షన్స్ కనపడతాయి.
మీరు మీ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలు ఎంచుకోవాలి.
చూసి వివరాలని ఏమైనా అవసరం అయితే సరిదిద్దుకోవచ్చు.
ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఇలా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version