పెరగనున్న పీఎఫ్‌..తగ్గనున్న జీతాలు!

-

కొత్త వేతన సవరణ చట్టం నియమావళి ప్రకారం ఉద్యోగుల హోం టేక్‌ శాలరీ తగ్గనుంది. ఇది ఏప్రిల్‌ 1 నుంచి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్‌ నుంచి కొత్త వేతన కోడ్‌ బిల్లు 2021 లేదా కొత్త కార్మిక చట్టాన్ని అమలు చేయనుంది.


ఈ నూతన చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మార్పుల్లో అధికారిక పనిగంటలు, గ్రాట్యూటీ, ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) పెరగనుంది.
ఈ చట్టం అమల్లోకి వస్తే డీఏ పెరుగుతుందని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే నివేదిక ప్రకారం ప్రావిడెంట్‌ ఫండ్‌ పెరుగుతుంది, హోం టేక్‌ శాలరీ తగ్గనుంది. అలాగే ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వేతన కోడ్‌లో ఉద్యోగులు బేసిక్‌ శాలరీ సీటీసీలో 50 శాతం కలిగి ఉండాలనే నిబంధన ఉంది. ఇది ఉద్యోగి బేసిక్‌ శాలరీపై ప్రభావితం చేస్తుంది.పీఎఫ్, గ్రాట్యూటీ, డీఏ, టీఏ, ఇంటి అద్దె భత్యాల గణాంకాలు కూడా మార్పుటు చోటుచేసుకోనున్నాయి.

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత టేక్‌ హోమ్‌ శాలరీ 50 శాతం బేసిక్‌ ఉంటే తగ్గుతుంది. ఈ వాటాలో 24 (12+12) శాతం ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. దీనర్థం పీఎఫ్‌కు సహకారం పెరుగుతుంది. చాలా కంపెనీలు ఉద్యోగుల సీటీసీ నుంచి 12 శాతం పీఎఫ్‌ను తీసివేస్తాయి.

నూతన చట్టం నియమావళి ప్రకారం ఉద్యోగి ఏడాది పనిచేసిన ఈ గ్రాట్యూటీ వర్తిస్తుందని తెలిపింది. సాధారణంగా ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేస్తే గ్రాట్యూటీ వస్తుంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే స్వాతంత్య్ర భారత్‌లో లేబర్‌ చట్టంలో సవరణలు చేయడం ఇదే మొదటిదవుతుంది. ఇంకా ఈ నూతన చట్టంపై అధికారిక ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version