Jobs: మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కోసం అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నోటిఫికేషన్‌లో పలు విభాగాల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందుమేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ని తీసుకొచ్చింది. దీనిలో మొత్తం 247 ఖాళీలు వున్నాయి. హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు చూస్తే.. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) (217), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) (30) ఖాళీలు ఉన్నాయి.
ఉద్యోగాలు ఇక వయస్సు వివరాలు చూస్తే.. అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) పూర్తి చేసి ఉండాలి. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు చూసుకోండి. పైన తెలిపిన విధంగా అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు జీతం ఇస్తారు. రాత పరీక్ష 04-06-2023 తేదీన ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 12-05-2023 చివరి తేదీ. పూర్తి వివరాలని మీరు https://bsf.gov.in/ లో చూడచ్చు.