మీ సేవ 2.0 వెర్షన్.. ఇంట్లో కూర్చొని కావాల్సిన డాక్యుమెంట్‌కు అప్లయి చేసుకోండి..!

-

టీ యాప్ ఫోలియో(T App Folio) ఈ యాప్‌ను ఇదివరకే ప్రభుత్వం తీసుకొచ్చినా.. తాజాగా ఐటీశాఖ దాన్ని అప్‌డేట్ చేసి అన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీకు క్యాస్ట్ సర్టిఫికెటో లేదా ఇన్‌కమ్ సర్టిఫికెటో.. ఇంకేదో సర్టిఫికెట్ కావాలంటే ఏం చేస్తారు. ముందు ఊళ్లోకి వెళ్లి వీఆర్‌వోను పట్టుకొని ఆయన నుంచి సంతకం తీసుకొని ఆ తర్వాత మండలం వెళ్లి ఆర్‌ఐతో సంతకం తీసుకొని ఆ తర్వాత ఎంఆర్‌వో ఆఫీసులో ఫామ్‌ను సబ్మిట్ చేస్తే.. వాళ్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓ నెల రోజులకు సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది. దీని కోసం మీరు ఎంతో కొంత సమయాన్ని మాత్రం వదులుకోవాలి.

ఇలా ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా సర్టిఫికెట్ల ఇష్యూ లేట్ అవుతుండటం వల్లనే మీ సేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ.. మీ సేవలో ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల ఇప్పటి వరకు డాక్యుమెంట్ల ఇష్యూ లేట్ అయ్యేది. కానీ.. ఇక నుంచి ఆ భయం అవసరం లేదు. అటువంటి సమస్యలే రావు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మీసేవ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. మీ ఇంట్లో కూర్చొని ఏ సర్టిఫికెట్‌నైనా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి అప్లయి చేసుకోవచ్చు. ఇదివరకులా రోజులకు రోజులకు సమయం పట్టదు. సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తే.. వారం రోజుల్లోనే మీ సేవకు వెళ్లి సర్టిఫికెట్‌ను తీసుకోవచ్చు. అందుకే దానికి మీ సేవ 2.0 వెర్షన్ పేరు పెట్టారు. రోబో 2.0 అప్‌డేటెడ్ వెర్షన్‌లా అన్నమాట.



టీ యాప్ ఫోలియో(T App Folio) ఈ యాప్‌ను ఇదివరకే ప్రభుత్వం తీసుకొచ్చినా.. తాజాగా ఐటీశాఖ దాన్ని అప్‌డేట్ చేసి అన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏ సర్టిఫికెట్ అయినా ఇందులో అప్లయి చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ఉన్నవాళ్లు ఆ యాప్‌ను తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్‌కు అప్లయి చేసుకోవాలి. దానికి సంబంధించిన రుసుమును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. అప్లికేషన్ నింపే సమయంలో ఏవైనా సందేహాలు వస్తే కాల్ సెంటర్ నెంబర్ 1100 లేదా 18004251110 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదంటే 9121006471, 9121006472 నెంబర్లకు వాట్సప్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version