రేషన్ కార్డు కొత్త రూల్స్..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు, పాన్ కార్డులాగే రేషన్ కార్డు కూడా చాల అవసరం. రేషన్ కార్డు కలిగిన వారు సబ్సిడీ రేటుకే ప్రభుత్వాల నుంచి రేషన్ సరుకులని పొందొచ్చు. అలానే చాలా వాటికి ఇది ప్రూఫ్ గా కూడా పని చేస్తుంది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉచిత రేషన్ కూడా ఆఫర్ చేస్తోంది.

ration-cards

ఇంకా ప్రభుత్వాలు అందించే ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇలా ఎన్నో ఉపయోగాలు వున్నాయి కనుక దీనిని ముఖ్యమైన డాక్యుమెంట్ అనాలి. అయితే ఇక కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. రానున్న కాలంలో కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి అని తెలుస్తోంది. అనర్హులు కూడా రేషన్ పొందుతున్నారని పలు ఫిర్యాదులు కేంద్రానికి అందడంతో కొత్త రూల్స్ ని తీసుకు రానున్నారు.

పేదలకు రేషన్ కార్డు చాలా అవసరం. కానీ కొంత మంది ఆర్థికంగా బాగున్నా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఇలాంటి వారికి కొత్త రూల్స్ వల్ల రేషన్ బంద్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల మధ్య రేషన్ కార్డు కొత్త రూల్స్ అంశంపై చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. మోదీ సర్కార్ రాష్ట్రాల ప్రతిపాదలను, సూచలను పరిగణలోకి తీసుకొని ఈ నయా రూల్స్ ని తీసుకు రానుంది. ఒకవేళ ఆ రూల్స్ వస్తే అవసరం లేని వారికి ఇక రేషన్ కార్డు ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version