పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!

-

బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకునే వాళ్లకి శుభవార్త. బంగారం ధరలు (Gold Price) మరో సరి తగ్గాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం పడి పోయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పడి పోయింది. దీంతో బంగారం రేటు రూ.49,640 కి క్షీణించింది. ఇది ఇలా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే వుంది.

రూ.240 తగ్గుదలతో రూ.45,500కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.09 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1867 డాలర్లకు చేరింది.

ఇది ఇలా ఉంటే వెండి రేట్లు కూడా తగ్గాయి. వాటి రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. వెండి రేటు ఈరోజు భారీగానే దిగొచ్చిందని చెప్పుకో వచ్చు. రూ.800 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.76,500కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రేటు మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 27.97 డాలర్లకు దిగొచ్చింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలైన వాటి వలన రేటు పై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version