రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాల నేపధ్యంలో, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులతో భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గడువు ముగుస్తుంది… ఈ ప్రక్రియను 31 డిసెంబర్, 2019 కల్లా పూర్తి చేయాలని ఎస్బీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 31 డిసెంబర్ 2019 కల్లా ఖాతాదారులు తమ మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఏటీఎం-కమ్-డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో అప్‌డేట్ చేసుకోమని సూచిస్తుంది.
దీనిని ఆన్లైన్ లోనే పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది… మీ పాత కార్డును కొత్త ఈఎంవీ చిప్ కార్డుతో అప్‌డేట్ చేసుకోడానికి బ్యాంక్ మీకు మరో అవకాశం కల్పించింది. అది ఎలా అంటే…
తొలుత ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పైన ఉన్న ఆప్షన్స్ లో ఈ-సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే, ఏటీఎం కార్డ్ సర్వీసు కనపడుతుంది.
దానిని ఎంచుకున్న అనంతరం… రిక్వెస్ట్ ఏటీఎం / డెబిట్ కార్డుపై క్లిక్ చేయండి. ధృవీకరించడానికి మీ ఆప్షన్ ను ఎంచుకోండి.
ఆ తర్వాత యూజింగ్ వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) పై క్లిక్ చేయగానే…
మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. అనంతరం ఖాతాను ఎంచుకుని… కార్డులోని పేరు, కార్డు టైపు వంటి వివరాలను నమోదు చేయండి.
తరువాత నిబంధనలు, షరతులపై క్లిక్ చేసి, ఆపై సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి 7 నుంచి 8 పని దినాలలో మీ డెబిట్ కార్డును అందుకుంటారని ఒక నోటిఫికేషన్ మీకు కనపడుతుంది.
మీ హోమ్ బ్రాంచ్ ను సందర్శించి మీ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను కూడా పొందవచ్చు. ఇంకా మార్చుకొని వారికి ఇది ఒక రకంగా శుభవార్తే.