వారికి ఇక రేష‌న్ కార్డ్ క‌ట్‌.. ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..

-

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భ‌ద్రతా నియ‌మాల్లో ఏపీ ప్రభుత్వం స‌వ‌ర‌ణ‌లు చేసింది. రేష‌న్ కార్డుల జారీకి గ‌తంలో ఉన్న అర్హ‌త‌ల్లో మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వార్షికాదాయం, ఇత‌ర నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్స్ వాహనాలు ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులను మాత్రం బీపీల్ కోటా కింద పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఐతే క్యాబ్‌లు నడుపుకునే వారికి కూడా ఇది వర్తిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే గ్రామాల్లో వార్షికాదాయం లక్షా 20 వేల రూపాయలు, పట్టణాల్లో వార్షికాదాయం లక్షా 44 వేల రూపాయలు ఉన్న కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి స్వర్ణ బియ్యానికి సమానమైన నాణ్యమైన బియ్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యాన్ని ఇంటికే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంది. కాగా, ప్రభుత్వం 2020 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి 13 జిల్లాల్లో నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version