SBI కస్టమర్లు బ్యాంక్ అకౌంట్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోండి… లేకపోతే..?

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉందా ? అయితే దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. మీరు కనుక ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా విదేశీ లావాదేవీలను ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందాలని అనుకుంటే తప్పకుండ ఈ అప్డేట్ ని మీరు తెలుసుకుని తీరాలి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ముఖ్యమైన సమాచారం అందించింది. ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారు వారి పాన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి అని ఎస్‌బీఐ తెలియజేసింది.

మీరు కనుక పాన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకుంటే డెబిట్ కార్డు ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతర్జాతీయ లావాదేవాలు నిర్వహించొచ్చు అని వెల్లడించారు. ఇది కనుక అప్డేట్ చేసుకోకపోతే అంతర్జాతీయ లావాదేవీల విషయంలో ఇబ్బందులు తప్పవు. కనుక విదేశీ లావాదేవీలను ఆటంకాలు లేకుండా నిర్వహించాలంటే అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. పెద్ద కష్టం ఏమి కాదు ఎంతో సులువుగా పాన్ కార్డు నెంబర్‌ను ఎస్‌బీఐ అకౌంట్ ‌తో లింక్ చేసుకోవచ్చు.

మీరు మీ వీలుని బట్టి ఆన్‌లైన్ లోనైనా, ఆఫ్‌లైన్ లోనైనా చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో చేయించుకోవాలంటే..? మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి పాన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జికార్స్ ఇచ్చి లింక్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో లింక్ చేసుకోవాలని అనుకునే వారు ఎం చెయ్యాలంటే…? ఎస్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ ‌లో వెళ్లాలి. ఆ తరువాత ప్రొఫైల్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఫైనల్ గా పాన్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version