ఎస్‌బీఐ గుడ్ న్యూస్… కొత్త సర్వీసులు షురూ…!

-

ఎస్బీఐ ఇప్పటికే తమ కస్టమర్స్ కోసం పలు రకాల సేవలని అందిస్తోంది. తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు కొత్త సర్వీసులని అందిస్తున్నట్టు చెప్పింది. ఇది నిజంగా కస్టమర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. వీడియో కేవైసీ ఆధారిత అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు లాంచ్ చేసింది.

మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్‌ లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల్లో ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు అత్యవసరమని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. అందుకే ఈ సరి కొత్త సర్వీసుని తీసుకొచ్చామని అన్నారు. ఎస్‌బీఐ లో బ్యాంక్ అకౌంట్ తెరవాలని భావించే వారు ఈ ఫీచర్ తో ఈజీగా తెరవచ్చు. ఖాతా తెరవాలంటే యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మరి దీనికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ని కస్టమర్స్ పొందుతారు అనేది చూస్తే… ఈ కొత్త సేవల ద్వారా కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుకు వెళ్ళక్కర్లేకుండా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ AI , ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా కాంటాక్ట్‌లెస్ అండ్ పేపర్‌లెస్ మార్గం లో బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చని ఎస్‌బీఐ చెప్పింది.

ఇలా ఖాతా ఎలా తెరవాలని అంటే….? యోనో యాప్ డౌన్‌లోడ్ చేసి… న్యూ టు ఎస్‌బీఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి… తర్వాత ఇన్‌స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ఓకే చేయాలి. ఇప్పుడు ఆధార్ వివరాలు అందించాలి. ఆధార్ అథంటికేషన్ పూర్తయిన తర్వాత వివరాలు ఇచ్చి, వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోవాలి. అక్కడ కేవైసీ పూర్తియిన తర్వాత ఖాతా తెరుచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version