ఈ కేంద్ర పథకంలో పెట్టుబడి పెడితే మీ మగ బిడ్డల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది..

-

చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఎంతగానో కృషి చేస్తుంటారు. తమ చిన్నారులు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. ఇందు కోసం ఆర్థికంగా వారికి అండగా నిలవాలని తల్లి దండ్రులు ఎంతగానో తాపత్రయపడుతుంటారు.ఈ రోజుల్లో చిన్నారుల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే చాలా మంది కూడా కేవలం ఆడ బిడ్డల కోసమే పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా మగ పిల్లల కోసం కూడా పొదుపు చేస్తున్నారు.ప్రభుత్వం కూడా మగబిడ్డల కోసం పథకాలను అందిస్తున్నాయి.

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌ మగ బిడ్డలకోసం మంచి పథకాలను అమలు చేస్తోంది. బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చినట్లుగానే బాలుర కోసం కూడా కొన్ని పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాంటి ఓ బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..మగ పిల్లల కోసం పోస్టాఫీస్‌ అందిస్తోన్న బెస్ట్‌ స్కీమ్స్‌లో కిసాన్‌ పత్ర పథకం అనేది ఒకటి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఈ పథకాన్ని పోస్టాఫీస్‌ 1988 వ సంవత్సరంలోనే తీసుకొచ్చింది.

ముఖ్యంగా తక్కువ ఆదాయం వచ్చే వారికి, ఏడాదికి నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే వయస్సు ఎంత ఉండాలంటే.. 18 ఏళ్ల వయసు వచ్చిన వారెవరైనా కూడా ఈ స్కీమ్‌కు అర్హులు. అయితే, 18 ఏళ్ల లోపు వయసు ఉంటే వారి తరపున సంరక్షకులు లేదా తల్లిదండ్రులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు. ఇక గరిష్టంగా అయితే ఎంతైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టిన పెట్టుబడిపై వార్షిక వడ్డీ మొత్తం 7.9 శాతంగా నిర్ణయించారు. మెచ్యూరిటీ టెన్యూర్ వచ్చేసి పది సంవత్సరాలు నాలుగు నెలలుగా ఉంటుంది. ఇంకా అంతేకాదు ఈ పథకంలో తక్కువ వడ్డీ రేటుకే తల్లి దండ్రులు లోన్‌ కూడా తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version