రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్స్ వలన కలిగే లాభాలివే….!

-

కేంద్రం కొత్త స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ప్రయోజనకరం ఉంటుంది. ప్రధాని మోదీ తాజాగా ఆర్‌బీఐకి సంబంధించిన రెండు కొత్త పథకాల్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ స్కీములకి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అనేవి వీటి పేర్లు.

 

RBI

ఈ స్కీమ్స్ వలన గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఆర్‌బీఐ తమ యొక్క సర్వీసులకు సంబంధించి స్ట్రెంత్ ని పెంపొందించడానికి టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించుకుంటుందని శక్తి కాంత్ దాస్ తెలిపారు. అయితే ఈ ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అన్నారు.

ఇన్వెస్టర్లు సులభం గానే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అకౌంట్‌ను ఆర్‌బీఐ వద్ద ఉచితంగానే ఓపెన్ చేయడానికి కూడా అవుతుంది. రిజర్వు బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అయితే కస్టమర్ల ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించచ్చు. ఒకే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం, డాక్యుమెంట్ల సమర్పణ, ఫిర్యాదు స్టేటస్ మొదలైన సర్వీసులని పొందవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version