రైతులు ఒకేసారి రూ. 4000 పొందే అవకాశం… వెంటనే ఇలా చెయ్యండి…!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. అయితే వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఏటా 6,000 రూపాయలు జమ చేస్తారు. ప్రతి విడతలో 2,000 వేల రూపాయలను అందిస్తుంది. రైతుల ఖాతాలకు ప్రభుత్వం 10 విడతల్లో డబ్బులు పంపింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది.

farmers

ఇలా చేయలేదు అంటే రైతులకు ప్రయోజనం ఉండదు. కనుక ఈ-కేవైసీ తప్పక చేయించాలి. 11వ వాయిదాకు డబ్బును పొందాలనుకుంటే, 31 మార్చి 2022లోపు e-KYC పూర్తి చెయ్యాలి. లేదు అంటే ఏప్రిల్-జూలైకి సంబంధించి రూ. 2000 వాయిదా ఖాతాల్లో జమ అవ్వవు. అయితే స్వయంగా ఈ-కేవైసీ కూడా చేసుకోచ్చు.

మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే పీఎం-కిసాన్ వెబ్ పోర్టల్‌కి వెళ్లి, ఈ-కేవైసీ ఎంపికను సెలెక్ట్ చేసుకోచ్చు. పోర్టల్‌లో వారి నుంచి ఆధార్ నంబర్ అడుగుతారు. పోర్టల్‌లో కనిపించే వివరాలను పూర్తి చేసిన తరువాత సెర్చ్ పైన క్లిక్ చెయ్యాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. గెట్ OTPపై క్లిక్ చేయండి. రైతు మొబైల్‌కు OTP వస్తుంది.

రైతు మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే సువిధ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఇ-కెవైసిని పొందాలి. 2022 జనవరి 1న ఈ పథకం 10వ విడతలో రైతులకు రూ.2000 లభించింది. త్వరలో 11వ విడత పీఎం కిసాన్ యోజన కిందకి వస్తుంది. దరఖాస్తు చేసుకోని రైతులకు ఈ అవకాశం ఇస్తారు. స్కీమ్ కోసం తమను తాము నమోదు చేసుకుంటే రెండు వాయిదాల డబ్బును అందుకుంటారు. అప్పుడు పదో విడతలో రూ.2వేలు కలిపి మొత్తం రూ.4వేలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news