పీఎం కిసాన్ : జాగ్రత్త.. ఈ పనులు చేయకుంటే డబ్బులు పడవు..

-

దేశంలోని పేద ప్రజల కోసం భారత ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశం అనేది స్వచ్ఛమైన వ్యవసాయ దేశం. అందువల్ల వ్యవసాయం చేసే పేద రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది.అలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చాలానే ఉన్నాయి. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.

 

కేంద్రం రైతులకు అందించే పథకాలలో ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించే పథకం ఉంది. 2018 సంవత్సరంలో భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా రూ.6000 కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది.ఇక ఈ డబ్బు మొత్తాన్ని కూడా మూడు విడతల్లో రూ.2000 చొప్పున కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి దాకా కూడా మొత్తం 17 వాయిదాలను భారత ప్రభుత్వం విడుదల చేసింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పథకం తదుపరి అంటే 18వ విడత ఇంకా రావాల్సి ఉంది.

కిసాన్ యోజన 18వ విడతను అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వం విడుదల చేయవచ్చని తెలుస్తుంది. అయితే ఇన్‌స్టాల్‌మెంట్‌ అనేది వచ్చే ముందు రైతులు కొంత పనిని చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి వాయిదాల సొమ్ము నిలిచిపోతుంది.దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సమాచారం కూడా అందించింది. ఈ పథకం కోసం, దాని ప్రయోజనాల కోసం లబ్ధిదారులైన రైతులు ఇ-కెవైసి ఇంకా అలాగే భూమి ధృవీకరణను పొందడం ఖచ్చితంగా చాలా అవసరం. ఇప్పటి దాకా ఈ పనులు చేపట్టని రైతులు వెంటనే చేసుకోవడం మంచిది. లేకుంటే తదుపరి వచ్చే విడుతలో వారికి రావాల్సిన డబ్బులు నిలిచిపోతాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఇ-కెవైసి ఇంకా అలాగే భూమి ధృవీకరణను పొందడం చాలా ముఖ్యం. లేదంటే వారికి డబ్బులు అకౌంట్లో పడే అవకాశాలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version