భారత ప్రభుత్వం ఇటీవల మేక్ ఇన్ ఇండియా యూనియన్ బడ్జెట్ 2024 -25 లో భాగంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభం చేసింది. ఈ పథకం ద్వారా సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎమ్ఈల కు) ఆర్థిక సహాయాన్నిఅందిస్తోంది. అయితే ఈ పథకం పేరు మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎమ్ఈలు మిషన్లు లేక ఇతర పరికరాలను కొనుగోలు చేయడానికి రుణాన్ని పొందవచ్చు. అయితే ఈ ఆర్థిక సహాయం ద్వారా దేశంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి మరియు తయారీ పరిశ్రమ కూడా మెరుగుపడుతుంది అని దీనిని ప్రారంభించడం జరిగింది.
అర్హత వివరాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీ సంస్థ ఎంఎస్ఎంఈ గా రిజిస్టర్ అయ్యి ఉండాలి మరియు తయారీ పరిశ్రమంగా గుర్తింపు పొందాలి. పథకం ద్వారా పొందిన రుణం లో కనీసం 75% వరకు మిషన్లకు మరియు పరికరాలకు ఖర్చు చేయాలి.
ఈ పథకంలో భాగంగా ఎంఎస్ఎమ్ఈలు పొందగలిగే రుణ పరిమితి 100 కోట్లు వరకు ఉంది, అంటే ఒక ఎంఎస్ఎమ్ఈ కి 100 కోట్ల వరకు రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే 50 కోట్ల వరకు రుణం పొందిన ఎంఎస్ఎమ్ఈలు తిరిగి ఎనిమిది సంవత్సరాల లోపు చెల్లించాలి.
దీనిలో మొదటి రెండు సంవత్సరాలు వరకు కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది, అంటే మొదటి రెండు సంవత్సరాలలో అసలు రుణాన్ని మరియు వాయిదాలను చెల్లించాల్సిన అవసరం లేదు. 50 కోట్ల కంటే ఎక్కువ రుణం పొందిన వారికి చెల్లింపు వ్యవధి మరియు మినహాయింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం ద్వారా ఎంఎస్ఎమ్ఈ రంగాన్ని అభివృద్ధి చేసి మంచి పరికరాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ విధంగా సహాయం చేస్తోంది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని చేయవచ్చు మరియు అభివృద్ధిని సాధించవచ్చు.