రైతు భరోసా పథకం గందరగోళంగా తయారైంది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు కడుదుల ఉప్పలయ్యకు 1.28 ఎకరాలు భూమి ఉంది.అయినప్పటికీ అతనికి ఒక్క రూపాయి రైతు భరోసా రాలేదు.
దీంతో తనకు రైతు భరోసా డబ్బులు జమ అవ్వట్లేదని నర్సింహులపేట రైతు వేదికలో సదరు రైతుతో పాటు తోటి అన్నదాతలు సైతం ధర్నాకు దిగారు. రైతు భరోసా గురించి వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే తమకు ఏమీ తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా వేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
గందరగోళంగా రైతు భరోసా పథకం
మహబూబాబాద్ – నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన రైతు కడుదుల ఉప్పలయ్యకు 1.28 ఎకరాలు ఉన్నా కూడా ఒక్క రూపాయి రైతు భరోసా కూడా పడలేదు
దీంతో రైతు భరోసా డబ్బులు జమ అవ్వట్లేదని నర్సింహులపేట రైతు వేదికలో ధర్నాకు దిగిన రైతులు
వ్యవసాయ అధికారుల… pic.twitter.com/XnkK6eVJRJ
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025