చాలా శాతం మంది సొంత ఇల్లును కట్టుకోవాలని అనుకుంటారు. కాకపోతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వలన దానిని సొంతం చేసుకోలేరు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేయడానికి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సొంత ఇల్లును అందిస్తోంది.
అర్హత వివరాలు:
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేవలం భారతదేశ పౌరులు మాత్రమే అర్హులు మరియు కేవలం 70 సంవత్సరాలు కంటే తక్కువ వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పధకానికి దారిద్ర రేఖ కు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు మరియు దరఖాస్తు చేసుకునే వారికి లేక వారి కుటుంబ సభ్యులకి సొంత ఇల్లు ఉండకూడదు. అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ముందు ఎటువంటి ప్రభుత్వ సహాయాన్ని ఇంటి కొనుగోలుకు తీసుకొని ఉండకూడదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ కు వెళ్లి లాగిన్ చేయాలి. అక్కడ ఉండేటువంటి సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. దీని తర్వాత ఆధార్ కార్డు వివరాలను మరియు ఇతర వివరాలను అందించాలి. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయ వివరాలు కు సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా పూరించాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ను సేవ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు ఖాతా వివరాలు వంటి మొదలైన డాక్యుమెంట్లను దరఖాస్తు ఫారం తో కలిపి మీ దగ్గరలో ఉండేటువంటి పబ్లిక్ సర్వీస్ సెంటర్ లో అందజేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత అర్హులు అయిన వారికి ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందజేస్తోంది. ఈ పథకం ద్వారా అందిస్తున్న ప్రయోజనాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి మరియు డబ్బును అద్దెలకు వృధా చేయాల్సిన పని ఉండదు. పైగా సొంత ఇల్లు కూడా లభిస్తుంది.