ఆ రైలు లేటైతే ప్రయాణికులకు పండ‌గే.. ఎందుకో తెలుసా..

-

సాధార‌ణంగా అనుకున్న టైమ్‌కు రైలు రాక‌పోతే అప్పుడు వ‌చ్చే కోపం అంతా ఇంతా కాదు. అప్పుడ‌ప్పుడు రైలు లేటుగా వ‌స్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాలి అనే రూల్ ఉంటే బాగుంటుంద‌ని చాలా మందికి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే వాస్త‌వం అయింది. ఐఆర్‌సీటీసీ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లేటుగా వ‌స్తే ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఈ తరహా ప్రయోగానికి తెరతీస్తున్న తొలి రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్సే కావడం గమనార్హం. ఈ రైలు అక్టోబర్‌ 4 నుంచి ఢిల్లీ – లక్నోల మధ్య పరుగులు పెట్టనుంది.

ఈ రైల్లో లక్నో నుంచి ఢిల్లీకి చార్జీలు ఏసీ చైర్‌ కార్‌కు రూ. 1,125, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌కు రూ. 2,310గా ఉంది. ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్‌ కార్‌ రూ. 1280 కాగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌లో రూ. 2,450గా ఉండనుంది. ఈ రైలు చార్జీలు డిమాండ్‌కు అనుగుణంగా పెరుగుతాయి. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఈ రైలు గంట లేటుగా వస్తే రూ. 100, రెండు గంటలు లేటుగా వస్తే రూ. 250లు ప్రయాణికులకు చెల్లించనుంది. దీనితో పాటు ప్రయాణికులకు రూ. 25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఇవ్వనుంది. రైల్లో ప్రయాణిస్తున్నపుడు ఒకవేళ దోపిడీ జరిగితే రూ. లక్ష ఇవ్వనున్నట్లు రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. విమానాల్లోలాగే, రైల్లో కూడా ఉచిత టీ, కాఫీలు వెండింగ్‌ మెషీన్‌ ద్వారా ఇవ్వనుండగా, ఆర్వో మెషీన్‌ ద్వారా మినరల్‌ వాటర్‌ కూడా అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version