వీటినే గెరుసొప్పె ఫాల్స్, గెర్‌సొప్పా ఫాల్స్, జొగడా గుండి అని కూడా పిలుస్తారు. ఈ ఫాల్స్ షరావతి నదిపై ఉండే ఈ ఫాల్స్ ఎత్తు సుమారు 253 మీటర్లు ఉంటుంది. అంటే 830 ఫీట్లు అన్నమాట.
జోగ్ వాటర్ ఫాల్స్.. మీ జీవితంలో ఒక్కసారైనా అక్కడ గడిపి రావాల్సిందే. ఆ ప్రకృతి, కొండలు, గుట్టలు.. వాటి మధ్య నుంచి జాలువారే సెలయేర్లు.. ఆహా.. ప్రకృతికి మరో రూపం ఈ జోగ్ వాటర్ ఫాల్స్. చుట్టూ అడవి.. మధ్యలో సెలయేర్లు.. అంత ఎత్తు నుంచి జాలువారుతున్న నీటిని చూస్తూ అక్కడే గడిపేయాలనిపిస్తుంది. అంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలుసా? మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనే. అవును.. కర్ణాటకలోని షిమోగా జిల్లా సాగరాకు సమీపంలో ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి.
వీటినే గెరుసొప్పె ఫాల్స్, గెర్‌సొప్పా ఫాల్స్, జొగడా గుండి అని కూడా పిలుస్తారు. ఈ ఫాల్స్ షరావతి నదిపై ఉండే ఈ ఫాల్స్ ఎత్తు సుమారు 253 మీటర్లు ఉంటుంది. అంటే 830 ఫీట్లు అన్నమాట. అంతే కాదు.. దేశంలోనే రెండో అతి పెద్ద వాటర్ ఫాల్ ఇది. ఈ వాటర్ ఫాల్‌తో పాటు పక్కనే ఉన్న లింగన్‌మక్కి డ్యామ్, పవర్ స్టేషన్‌ను చూడొచ్చు. వాటర్ ఫాల్ నుంచి జాలు వారిన నీళ్లు ఆ డ్యామ్‌లోకి చేరుతాయి. ఆ డ్యామ్ నీళ్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
జోగ్ ఫాల్స్‌ను సందర్శించాలంటే… మాన్‌సూన్ సీజన్ సరైన సమయం. అంటే వర్షాలు పడే సీజన్.. జూన్ నుంచి ఆగస్టు వరకు దాన్ని సందర్శించవచ్చు. అప్పుడు వర్షం ద్వారా కురిసిన నీళ్లను కొండ పైనుంచి జాలు వారుతుంటే.. నీళ్లు కింద పడుతుండగా.. వచ్చే శబ్దం.. అక్కడి ప్రకృతి.. అంతా ఓ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే.. వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్‌ను చూడటానికి టూరిస్టులు వస్తుంటారు.
జోగ్ ఫాల్స్‌కు ఎలా వెళ్లాలంటే..
జోగ్ ఫాల్స్‌కు దగ్గరి రైల్వే స్టేషన్లు.. తలగుప్ప, సాగర్(ఎస్‌ఆర్‌ఎఫ్)
దగ్గరి బస్ స్టేషన్.. సాగర్
దగ్గరి ఎయిర్‌పోర్ట్..
హుబ్లి ఎయిర్‌పోర్ట్ నుంచి 130 కిలోమీటర్లు.
మంగళూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 135 కిమీలు
పూణె ఎయిర్‌పోర్ట్ నుంచి 500 కిలోమీటర్లు
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి 340 కిలోమీటర్లు.