ప్రయాణికులకు వియట్‌జెట్ గుడ్ న్యూస్..కేవలం రూ.9కే టికెట్..

-

ఎయిర్ లైన్స్ కంపెనీలు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్నాయి..ఇప్పటికే పలు కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు మరో ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తుంది.విమాన టిక్కెట్ వేలల్లో, వందల్లో కాదు ఇప్పుడు కేవలం 9 కే టిక్కెట్ లభిస్తుంది..వావ్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఏంటి నిజమా అని ఆశ్చర్య పోకండి.. కాస్త వివరంగా తెలుసుకుందాం…

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ కంపెనీ వియట్‌జెట్ ప్రయాణికుల కోసం వినూత్నమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.9 కే (ఎయిర్‌పోర్ట్ ట్యాక్స్, సర్‌చార్జీలు అదనం) విమాన టికెట్ పొందొచ్చని పేర్కొంటోంది. ఎకో క్లాస్‌కు ఈ రేటు వర్తిస్తుంది. న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు నుంచి వియత్నాంలోని హనోయ్, హో చిన్ మిన్ సిటీ, డా నాంగ్, ఫూ క్యోక్ నగరాలను వెళ్లే వారికి ఈ రేటు వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకునే వారు 2022 ఆగస్ట్ 15 నుంచి 2023 మార్చి 26 వరకు ప్రయాణించొచ్చు. ఇంతకుముందు కూడా ఈ విమానయాన సంస్థ రూ. 26కు విమాన టిక్కెట్ల ఆఫర్‌తో ముందుకు వచ్చింది..ప్రతి బుధ, గురు, శుక్ర వారాల్లో టికెట్ బుక్ చేసుకునే వారికే ఆఫర్ వర్తిస్తుంది. వియట్‌జెట్ వెబ్‌సైట్ www.vietjetair.com ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫ్లైట్ టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. కంపెనీ పరిమిత సంఖ్యలో సీట్లను ఈ ఆఫర్ కోసం కేటాయించింది. సీట్ల లభ్యత ఆధారంగానే ఆఫర్ ఉంటుంది. సీట్లు అయిపోతే సాధారణ టికెట్ రేట్లే వర్తిస్తాయి..

వచ్చే నెల నుంచి 11 రూట్లలో సర్వీసులు నడుపనుంది. భారతదేశం, వియత్నాం మధ్య 11 అదనపు కొత్త మార్గాలను ప్రకటించింది. దీంతో వియట్‌జెట్ సంస్థ ఈ రెండు దేశాల మధ్య కెపాసిటీ పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా అవతరించింది. కొత్త రూట్లలో సర్వీసులను కలుపుకుంటే.. ఈ విమానయాన సంస్థ రెండు దేశాల మధ్య 17 సర్వీసులను కలిగి ఉంటుంది. సెప్టెంబర్ 9 నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి…

Read more RELATED
Recommended to you

Exit mobile version