Karthikeya2 : కార్తికేయ 2 కొత్త ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్

-

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కథనాయకుడిగా వచ్చిన సినిమా కార్తికేయ. ఈ సినిమా ఊహించని బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కించారు.


ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్‌.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ జూలై 22వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ తేదీని వాయిదా వేసుకున్న చిత్ర బృందం…ఇటీవలే కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.

ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక తాజాగా సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్ట్‌ 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version