డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇంట్లో నుండే ఇలా అప్లై చెయ్యండి..!

-

డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ముఖ్యమో మనకి తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఏ వెహికల్ అయినా రోడ్ల పై డ్రైవ్ చేయడానికి అనుమతి ఉంటుంది. లేదు అంటే వాహనాల్ని నడపడానికి అవ్వదు. లైసెన్స్ లేకుండా నడిపితే జరిమానాలని ఎదుర్కోవాలి. అందుకే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

అయితే గతం లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ ని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పౌరులు అయితే మీరు ఇంట్లోంచే ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యచ్చు.

ఇంట్లో కూర్చొనే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చెయ్యచ్చు అనేది చూస్తే.. ఏ రాష్ట్రానికి చెందిన వారు అయిన ఆన్‌లైన్‌ లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో తెలంగాణ రాష్ట్రం మాత్రం లేదు.

అప్లై చెయ్యాలంటే ముందు https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do పరివాహన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ నేమ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చెయ్యండి.
దీనిపై క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అప్షన్ ని క్లిక్ చేసుకోండి.
ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి సేవలు లభిస్తాయి.
డ్రైవింగ్ లైసెన్స్ అప్లై అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
అక్కడ ఏఏ డాక్యుమెంట్లు అవసరమో కనపడతాయి.
అప్లికేషన్ ఫిల్ చేయాలి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి,
ఫోటో, సిగ్నేచర్ వంటివి కూడా అవసరం అవుతాయి.
పేమెంట్ ఫీజు కట్టాలి.
అప్లై చేసుకోవాలని భావించే వారి వద్ద కచ్చితంగా లెర్నర్స్ లైసెన్స్ నెంబర్ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version