NBK107 : బాలయ్య సినిమాలో శాండల్‌ వుడ్‌ హీరో

-

నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ పిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా లో శాండల్‌ వుడ్‌ హీరో దునియా విజయ్‌.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు.. ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్‌. చందా, జంగ్లీ , జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్ (2011) మరియు జయమ్మన మగా (2013) వంటి కన్నడ చిత్రాలలో దునియా విజయ్‌ నటించి…మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version