మన భారతదేశానికి ఏం దరిద్రం పట్టిందో తెలియదు గానీ వరుస ప్రమాదలతో ఇక్కడి ప్రజలు నిదురలేకుండా గడుపుతున్నారు.. ఇప్పటి వరకు కరోనా, ఆ తర్వాత విశాఖ గ్యాస్ లీకేజ్, ఇవే కాకుండా ముంబైలో నిసర్గ తుఫాను, అక్కడక్కడ ఏవో ప్రమాదాలు నిత్యం ఏదో ఒక వార్త జనాలను బెంబేలెత్తిస్తుండగా, తాజాగా ఈ రోజు గుజరాత్లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయట. ఆ మంటలు కోరలు చాచుతూ, ఫ్యాక్టరీ మొత్తాన్ని దహించి వేస్తుండటంతో దట్టమైన నల్లటి పొగలు చుట్టు పక్కల ప్రాంతాలను కమ్ముకుంటున్నాయట..
ఇక ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారట.. ఇక గత నెల 18 వ తారీఖున మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో ఓ పెయింట్ దుకాణంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు గుజరాత్లోని రసాయన ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..
ఇది నిర్లక్ష్యం వల్లనో మరి దేనివల్లనో కానీ ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువగా అమాయకులు బలవుతుండటం పరిపాటిగా మారింది.. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే 40 మంది వరకు సిబ్బంది గాయపడినట్లుగా సమాచారం.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిచికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది..