రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన వరంగల్ పర్యటించారు. ప్రజా పాలన విజయోత్సవ సభ నేపథ్యంలో సభపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు నిరాశే మిగిల్చింది. పదేళ్ల కంటే 11 నెలల్లో మెరుగైన పాలన అందించామని తెలిపారు మహేష్ గౌడ్. ఈనెల 19న వరంగల్ లో విజయోత్సవ సభ ఉంటుందని తెలిపారు.
ఈ సభలో దాదాపు ఎత్తున మహిళలు పాల్గొనే అవకాశముంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని అందుకే ఆ పార్టీ నేతలు ఇస్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రెండు దఫాలుగా నీళ్లు, నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ తెలంగాన ప్రజలను మోసగించారని తెలిపారు. కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు.