జిల్లా వాసుల కొంప ముంచుతున్న హైదరాబాద్ నగరం.. ?

-

నగరానికి వచ్చే ప్రజలకు ఒక హెచ్చరిక అదేమంటే.. ముఖ్యంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మాత్రం మీకు దగ్గర్లో, అందుబాటులో ఉన్న వైద్యశాలల్లో చికిత్స తీసుకోండి.. కానీ హైదరాబాద్‌కు వెళ్లితే తొందరగా నయం అవుతుందని భావిస్తే మాత్రం నయం అవడం మాట పక్కన పెడితే, మీరు తొందరగా మరోలోకం పోవడం ఖాయమంటున్నాయి ఇక్కడి సర్వేలు.. బాబు భయపెట్టింది చాలు అసలు విషయం చెప్పండి అని అంటున్నారా.. అక్కడికే వస్తున్న.. ఈ మధ్య కాలంలో కరోనా వల్ల లాక్‌డౌన్ విధించి దాన్ని క్రమక్రమంగా సడలించారు.. దీంతో ఇప్పుడు నగరంలో కరోనా వైరస్ పర్మినెంట్‌గా తిష్టవేసుకుని కూర్చోగా, వైద్యం కోసం వచ్చే వారిని కబళిస్తుందట.. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. జిల్లాల నుంచి చికిత్స కోసం నగరంలోని హాస్పిటళ్లకు వస్తున్న వారు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారట.

ఇటీవల సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి గుండె జబ్బు కారణంగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటు మరణించగా ఆయన మృతదేహన్ని సొంతూరు తీసుకెళ్లాక అనుమానం వచ్చిన టెస్టులు చేస్తే కానీ ఆయనకు కోవిడ్ సోకిన విషయం తెలియలేదు. ఇతనే కాదు గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న యాదాద్రిలోని రాజాపేటకు చెందిన ఓ నిండు గర్భిణి కూడా హైదరాబాద్‌‌లో ప్రసవం తర్వాత చనిపోయింది. టెస్టులు చేయగా ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడగా, కాలు ఆపరేషన్ చేయడం కోసం నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతున్న సమయంలో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

 

అంతే కాకుండా క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు చికిత్స కోసం జిల్లాల నుంచి వస్తోన్న చాలా మంది కూడా కరోనా బారిన పడి చనిపోతున్నారు. వీరికి కరోనా ఎలా సోకుతుందనే విషయంలో క్లారిటీ లేదు. హాస్పిటల్‌లో చేరినప్పుడు కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చి.. మరోసారి టెస్టు చేసినప్పుడు పాజిటివ్ అని రావడంతో చికిత్స కోసం హాస్పిటళ్లలో చేరాకే వీరు కోవిడ్ బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు. ఇలా వివిధ రకాలైన వ్యాధులకు చికిత్స తీసుకోవడం కోసం హైదరాబాద్‌లోని హాస్పిటళ్లలో చేరిన వారు కరోనా బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎక్కడి వారు అక్కడే చికిత్సలు తీసుకోవడం ఉత్తమం అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందట..

Read more RELATED
Recommended to you

Latest news