ఐపీఎల్ 2025 సీజన్ కి సంబంధించి నిన్న, ఇవాళ ఆటగాళ్ల కోసం వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు. టీమిండియా క్రికెటర్ అత్యధిక ధరకు అమ్ముడు పోయినప్పటికీ ఈ భారత క్రికెటర్లకి మాత్రం కాస్త నిరాశ తప్పలేదు. వారిలో అజింక్య రహానే, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్ కి ఐపీఎల్ వేలంలో నిరాశ ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.
అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ విలయమ్సన్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ ను కూడా ఎవ్వరూ కొనకపోవడం గమనార్హం. వెస్టిండిస్ బ్యాటర్ రోవ్ మన్ పావెల్ కనీస ధర రూ.1.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ ని కనీస ధర రూ.2కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వాషింగ్టన్ సుందర్ ను రూ.3.20కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అలాగే ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాను ను రూ.2.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.