నేడు దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో నేడు ఉదయం భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేడు సెన్సెక్స్ 99 పాయింట్లు 36,694 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 35 పాయింట్లు లాభపడి 10,803 వద్ద నిలిచింది. మార్కెట్ మొదలైన సమయంలో ఇన్వెస్టర్లు కొనుగోలు జోరు అందుకోవడంతో సెన్సెక్స్ ఓ దశలో 425 పాయింట్లు లాభపడింది. అయితే మిడ్ సెషన్ కల్లా కొనుగోళ్ల స్థాయి అమ్మకాలు పెరగడంతో లాభాలు తగ్గి పోయాయి.
ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయాన్ని చూస్తే.. టెక్ మహీంద్రా, హెచ్ సిఎల్ టెక్, హిందాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్, జెఎస్డబ్ల్యు స్టీల్ కంపెనీల షేర్లు అత్యధిక లాభాలు పొందిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు 5 శాతం పైగా లాభపడింది. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ముందుగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ సంస్థ షేర్ అత్యధికంగా 2 .4 % నష్టపోయింది.