నకిలీ డాక్టర్ల హవా.. ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది మరీ..!

-

వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ.. వాళ్ల ప్రాణాలను డేంజర్ లో పడేస్తున్నారు నకిలీ డాక్టర్లు. వైద్యం చేస్తున్నారని నమ్మించి డబ్బులు గుంజుతున్నారు. ఈ నెల 18వ తేదీన రాత్రి వెస్ట్ జోన్ పోలీసు టీంకు సమాచారం అందటంతో హుటాహుటీగా ఓ హాస్పిటల్ లో దాడులు జరిపారు. మహ్మద్ షోయబ్ సుభానీ (35), మహ్మద్ అబ్దుల్ ముజీబ్ (42)ని అరెస్ట్ చేశారు.

fake doctors
fake doctors

మెహదీపట్నంలోని అసిఫ్ నగర్ రోడ్డులో ఆంధ్రాబ్యాంక్ ఎదురుగా వీరు ఓ హాస్పిటల్ ను నడుపుతున్నారు. వీళ్లకు డాక్టర్లుగా ఎలాంటి అర్హత లేదు. కానీ ఫేక్ సర్టిఫికేట్లతో డాక్టర్లుగా నమ్మంచి ట్రీట్ మెంట్ పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దొరికినంత దోచుకుంటున్నారు. నిందితులు ఇద్దరూ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. సుభానీ ఇంటర్ చదివి, డిగ్రీ బీకాం సెకండ్ ఇయర్ మధ్యలో చదువు మానేశాడు. ముజీబ్ పదో తరగతి వరకు చదివి మెహదీపట్నంలోనే హుమాయూన్ నగర్ లోని ఎంఎం హాస్పిటల్లో డైరెక్టర్ గా పని చేశాడు. 2017లో ఆస్పత్రిని ప్రారంభించి ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను పొందారు. వీళ్ల గుట్టు అందరికి తెలవడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి.. నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డు జిరాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news