వాహ్‌.. జోఫ్రా ఆర్చ‌ర్ రిప్ప‌ర్‌.. డేవిడ్ వార్న‌ర్ వెనుక స్టంప్స్ ఎగిరిపోయాయ్‌..!

-

ఆస్ట్రేలియాతో ఇటీవ‌ల జ‌రిగిన 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలిచిన విష‌యం విదిత‌మే. కాగా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య శుక్ర‌వారం నుంచి 3 వ‌న్డేల సిరీస్ ప్రారంభ‌మైంది. అందులో భాగంగానే తొలి వ‌న్డే మాంచెస్ట‌ర్‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. కాగా ఇయాన్ మోర్గాన్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేప‌ట్టింది.

ripper from jofra archer warner stumps shattered

ఇక ఆస్ట్రేలియా త‌మ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ వికెట్‌ను 3వ ఓవ‌ర్‌లోనే కోల్పోయింది. ఇంగ్లండ్ సీమ‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ విసిరిన బంతి వార్న‌ర్ వెనుక వికెట్ల‌పై ఉన్న స్టంప్స్‌ను తాకింది. దీంతో స్టంప్స్ ఎగిరిపోయాయి. వార్న‌ర్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్ర‌మంలో వార్న‌ర్ వికెట్‌కు చెందిన ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా డేవిడ్ వార్న‌ర్ ఈ సిరీస్ అనంత‌రం ఐపీఎల్ ఆడ‌నున్నాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అత‌ను కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇక ఆర్చ‌ర్ ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ త‌ర‌ఫున ఆడ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news