నేడు బాబ్రీ మసీద్ కూల్చివేతపై తీర్పు.. సర్వత్రా ఉత్కంట !

-

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేడు లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దీంతో, దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. తీర్పు శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి కళ్యాణ్ సింగ్, వినయ్ కటియాతో పాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. మొత్తం 48 మందిపై అభియోగాలు మోపగా, దర్యాప్తు సమయంలోనే 16 మంది మృతి చెందారు. నిందితులపై నేరపూరిత కుట్ర, రెచ్చగొట్టే ప్రసంగాలకు పాల్పడ్డారంటూ అభియోగాలున్నాయి. 17 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన లిబర్హాన్ కమిషన్, 2009లో నివేదిక సమర్పించింది. వివాదస్పద కట్టడం (మసీదు) కూల్చివేత వెనుక కుట్ర ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. సంఘ పరివార్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్, బీజేపీ నేతలు ఇందుకు బాధ్యులని కమిషన్ విచారణలో వెల్లడించారు. అయితే ఎటువంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news