ఔరంగజేబు విధానాలు నేటికి ప్రజలను పీడిస్తున్నాయి.. ఎంపీ కొండా సంచలన వ్యాఖ్యలు

-

ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.  హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 300 ఏళ్ల క్రితం ఔరంగజేబు నోటి మాటతో భూములు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నేడు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్స్ తో ఆ భూములు మావి  అంటున్నారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు  కీలకం.. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వక్ప్  బోర్డును తీసుకొచ్చింది. సుప్రీంకోర్టుకు మించి వర్ఫ్ బోర్డుకు అధికారాలిచ్చారు.

వర్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం. నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితి. శీతాకాల
సమావేశాల్లో వక్ప్ బోర్డు బిల్లు పార్లమెంట్ లో పాస్ అవుతుంది.   బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని ఎంపీ పేర్కొన్నారు. ఖురాన్ లో వక్ఫ్ బోర్డు ప్రస్తావన లేదన్నారు. గుట్టం బేగంపేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news