చంద్రబాబుకి ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్ బాగా తెలుసు…కేటీఆర్

-

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసన్నారు. శనివారం ఆయన మూసాపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ…తెలంగాణలో చంద్రబాబు పెత్తనాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాము..అవసరమైతే ఏపీలోనూ వేలు పెట్టి చంద్రబాబుకి మా తడాఖ చూపిస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు కూడా వెనుకాడమన్నారు.. చంద్రబాబు డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.  ‘పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. పోడుగోడి నెత్తి పోచమ్మ కొట్టిందన్న’ సామెతను అమలు చేయడం  కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చన్నారు. గతంలో  హైదరాబాద్‌లో నాటకాలాడాలని చూస్తే..చంద్రబాబుని అమరావతికి తరిమికొట్టామన్నారు.

అదే విధంగా రానున్న ఎన్నికల తర్వాత తెదేపాను చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరిమికొడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏదో తనకు హవా ఉందని క్రియేట్ చేసుకోవడం తప్పా చంద్రబాబుకి అంత సీన్ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news