కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం ఇలా…!

-

నూతన సంవత్సరం అంటే ప్రతి ఒక్కరూ సరదాగా కుటుంబ సభ్యులతో, మిత్రులతో శ్రేయోభిలాషులతో గడుపుతుంటారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకుని గ్రాండ్ గా న్యూ ఇయర్ కి స్వాగతం చెప్తూ ఉంటారు. ఇప్పుడు నూతన సంవత్సరం రానే వచ్చేసింది. 2020 కి గుడ్ బై చెప్పి 2021 కి స్వాగతం పలికేయండి. పాత సంవత్సరం మిగిల్చిన మంచి, చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త లక్ష్యాలతో ఈ కొత్త సంవత్సరం ప్రారంభించడం చాలా ముఖ్యం. మహమ్మారి కారణంగా 2020లో అనారోగ్యం, ఒత్తిడి, నష్టం ఇలా అనేక వాటిని ప్రజలు ఎదురు కోవడం జరిగింది.

ఏది ఏమైనా వాటినన్నిటినీ మరచిపోయి ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు టెక్నాలజీ ఏ కాలాన్ని నడిపిస్తోంది. కనుక సోషల్ మీడియాలో మీ శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ఎలానో మీరు విష్ చేస్తూ ఉంటారు. నీ కోసం పలు కోట్స్ మరి ఆలస్యం ఎందుకు ఈ కోట్స్ ని మీరు చూసేసి నచ్చిన వాటిని మీ బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు ఇలా నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి.

”కదులుతోంది కాలం
ముందుంది జీవితం
అందమైన క్షణాలతో
దృఢమైన నీ ఆశలతో
సాగిపోవాలి విజయాలతో” అని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు….

నీవు వేసే ప్రతి అడుగు లో ఆనందం, విజయం ఉండాలని.. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, మేధస్సు నీకు కలగాలని కోరుకుంటూ …. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్…

ఆనందంగా ఉంటే దాటవచ్చు ఎంతటి కష్టమైనా
ఏ చింతా లేకుండా నీ చెంత ఆనందాలే పండాలని కోరుకుంటూ….
నీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news