ఆంధ్రా బ్యాంక్ లో మీకు ఎకౌంట్ ఉందా…? అయితే తప్పకుండ ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిపోయాయి కాస్త గమనించండి. అంతే కాదండోయ్ ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అయ్యాయి. పూర్తి విషయాల్లోకి వెళితే… బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు, అకౌంట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ అవ్వడం జరిగాయి కనుక ఈ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గమనించడం ముఖ్యం.
ఏబీ తేజ్ యాప్ వాడే వారికి ఈ విషయం వేగంగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటె ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు కూడా ఇప్పుడు యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్‌నే ఉపయోగించాలి. అలానే ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించాలని అనుకుంటే మాత్రం యూ మొబైల్ యాప్ వాడాలి. ఇక అసల విషయం లోకి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఐటీ వ్యవస్థలు అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసినదే.
దీనిలో భాగం గానే ఆంధ్రా బ్యాంక్ కస్టమర్ల అకౌంట్లను కూడా తన బ్యాంక్ లోకి బదిలీ చేసుకుంది. ఈ కారణం గానే ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్సీఎసీ కోడ్లు కూడా మారిపోయాయి. కాబట్టి మీరు ఎవరికైనా డబ్బులు సెండ్ చేస్తుంటే ఐఎఫ్ఎస్సీ కోడ్లను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. కనుక పరిశీలించాకే సెండ్ చెయ్యండి. అలానే మీ ఆంధ్రా బ్యాంక్ డెబిట్ కార్డు, పిన్ ద్వారా మీరు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.