రోజూ తల స్నానం చేయకూడదు. రోజూ తల స్నానం చేయడం వల్ల మాడు పొడిబారిపోయి
జుట్టు దృఢత్వం తగ్గిపోతుంది, కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు పొందాలంటే వారానికి రెండు సార్లు మించి తలస్నానం చేయకూడదు.
జుట్టుకు రబ్బర్ బ్యాండ్ గట్టిగా పెట్టడం వల్ల మాడు పై ఒత్తిడి పెరిగి పోయి, వెంట్రుకలు తెగిపోతాయి.
కెమికల్స్ లేని షాంపూ మరియు కండిషనర్ వాడాలి. సహజమైన ఉత్పత్తులు వాడితేనే ప్రయోజనం ఉంటుంది. మార్కెట్లో దొరికే హెయిర్ కేర్ ఉత్పత్తులను గుడ్డిగా వాడడం సరికాదు.
జుట్టు రాలిపోవడానికి ముఖ్యమైన కారణం పోషకాహార లోపం ఐరన్ , జింక్ , విటమిన్ ఏ, బి, ఈ మరియు ప్రోటీన్ ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం పోతుంది. జుట్టు ఎంతో ఆరోగ్యకరంగా మారుతుంది.
హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు తక్కువ వేడి ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ వేడి పెట్టడం వల్ల వెంట్రుకల లో ఉండే సహజమైన నూనె లు ఆవిరైపోతాయి, దాంతో జుట్టు పొడిగా మారి పోతుంది.
తల స్నానానికి వాడే నీరు ఎక్కువ వేడి ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న నీరు వాడితే మాడు పొడిబారిపోతుంది.
తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె ను కొద్దిగా వేడి చేసి తలకి రాసుకుని, ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా మరియు దృఢంగా కనబడుతుంది.