సైబర్‌ బీమా ఎందుకు?

-

సెకండ్‌ వేవ్‌ కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో వారు ఆన్‌లైన్‌ చెల్లింపు ఎక్కువగా చేస్తున్నారు. అయితే, దీంతోపాటు సైబర్‌ నేరాలు కూడా అంతకంతా పెరిగిపోతున్నాయి. మాల్వేర్, ఈమెయిల్, ఫిషింగ్‌ వంటి ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువవుతున్నాయి. అందుకే ద్రవ్య భద్రత కోసం కొన్ని బీమా సంస్థలు సైబర్‌ బీమాను అందిస్తున్నాయి. ఈ బీమాతో దాడిని ఆపలేము కానీ, నష్టాన్ని తగ్గించడానికి చేయూతనిస్తాయి. ఈ బీమా పాలసీ గురించి ఐఆర్‌డీఏఐ సలహాదారు జిగ్నేష్‌ షా మాట్లాడుతూ ‘సైబర్‌ పాలసీలు మన దేశంలో వ్యక్తిగత, కార్పొరేట్‌ స్థాయిల్లో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

చెల్లించాల్సిన ప్రీమియం

  • ఈ సైబర్‌ బీమా ప్రీమియం ధర రూ.650–700 ఏడాదికి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం చెల్లింపులకు వ్యక్తి వయసుతో సంబంధం ఉండదు.
  • ముఖ్యంగా సైబర్‌ దాడి అనంతరం ఖర్చులను మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ మోసాలు జరిగినపుడు ఆర్థిక నష్టం ఏర్పడితే పాలసీలో ఇచ్చిన హామీలను చెల్లిస్తాయి.
  • దీనివల్ల థర్డ్‌ పార్టీ, సేవలు కొనసాగింపులకు అయ్యే ఖర్చులకు వ్యతిరేకంగా నష్టపరిహారం చెల్లిస్తుంది.
  • అదే విధంగా సైబర్‌ దాడితో నష్టపోయిన వ్యక్తికి కౌన్సెలింగ్‌కు అయ్యే ఖర్చులను కూడా భరిస్తాయి.
  • ఈ బీమా సైబర్‌ నేరాలతో నష్టపోయిన వారికి చేయూతగా ఉంటుంది.
  • ఉద్దేశపూర్వకంగా జరిగే సైబర్‌ దాడులకు క్లెయిమ్‌ చెల్లింపులు ఉండవు.
  • అంతర్జాతీయ స్థాయిలో జరిగే సైబర్‌ దాడులకు ఈ బీమా వర్తించదు.
  • బీమా తీసుకోక ముందు జరిగిన నష్టానికి ఇది కవర్‌ చేయదు.
  • చివరికి సరైన పాస్‌వర్డ్‌తో పాటు యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేయకున్నా ఈ పాలసీ వర్తించదు.

Read more RELATED
Recommended to you

Latest news