27 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది..!

-

Tiktok star nina belongs to mexico wanted to commit suicide

టిక్ టాక్.. నేటి యూత్ కు టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ వీడియో యాప్ అది. స్మార్ట్ ఫోన్ ఉన్న యూత్.. టిక్ టాక్ తో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు. ఇందులో మనకు నచ్చిన విధంగా వీడియోలు చేసి పెట్టొచ్చు. ఆ వీడియోలు నచ్చితే ఫాలోవర్స్ పెరుగుతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. సోషల్ మీడియా స్టార్లు అయిపోతారు.

Tiktok star nina belongs to mexico wanted to commit suicide

అయితే.. ఇలా టిక్ టాక్ యాప్ కు అడిక్ట్ అయిపోయి.. ఎన్నో కామెడీ వీడియోలు చేసి.. 27 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఓ యువతి.. చివరకు ఆత్మహత్య చేసుకోవానుకున్నది. అవును.. తన పేరు నినా. మెక్సికోకు చెందిన నినా టిక్ టాక్ స్టార్. టిక్ టాక్ యాప్ లో తనకు 27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టిక్ టాక్ యాప్ లో నినాకు చెందిన వందల కామెడీ వీడియోలు ఉంటాయి. కామెడీ వీడియోలు చేయడానికి తాను ఎంతో కష్టపడేదట. తన వీడియోలు వైరల్ అవుతుంటే.. నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉండేదట. ఆ ఆనందంతోనే మరిన్ని వీడియోలు చేయడం ప్రారంభించిందట. అలా వీడియోలు చేసి చేసి… మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిందట నినా.

Tiktok star nina belongs to mexico wanted to commit suicide

బాగా డిస్టర్బ్ అవడంతో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నదట. చివరకు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నదట. కానీ.. ఆత్మహత్య సరైంది కాదని ఆలోచించి.. ఏదో ఒకటి చేయాలనుకున్నదట. కానీ.. తనను ఓదార్చడానికి కానీ.. తనతో మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకు రాలేదట. సోషల్ మీడియాలో 27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా ఒంటరి అయిపోయిందట నినా. ఆ ఫాలోవర్స్ ఎవరో తెలియదు. వాళ్లంతా వర్చువల్ ఫ్రెండ్స్. వాళ్ల వల్ల ఏంటి ఉపయోగం అంటూ తెగ బాధపడిపోయిన నినా.. చివరకు టిక్ టాక్ ను వదిలేసిందట. వీడియోలు చేయడమే మానేసిందట. తర్వాత తన మానసిక ఆరోగ్యం కొంచెం కుదుట పడిందట. ఇప్పుడు రియల్ ఫ్రెండ్స్ తో స్నేహం చేస్తున్నదట. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకొని కెరీర్ మీద దృష్టి పెట్టింది ఆ యువతి.

Tiktok star nina belongs to mexico wanted to commit suicide

Read more RELATED
Recommended to you

Latest news