దెయ్యాల భయంతో పోలీస్ స్టేషన్ కి వెళితే.. దెయ్యాలపై పోలీసులు కేసు నమోదు..!

-

ఒక మనిషికి భయంతో Jambughoda పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం పరుగులు తీశాడు. ఆఖరికి పోలీసులు ఆ దెయ్యాల మీద కంప్లైంట్ ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అసలు ఏం జరిగిందో చూస్తే..

 

ఒకతను భయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. తనని కొంతమంది దెయ్యాలు చంపేయాలని అనుకున్నాయని అందుకే పోలీస్ స్టేషన్ కి వచ్చాను అని అన్నాడు. ఆ 35 ఏళ్ల వ్యక్తి తనని కాపాడమంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.

పోలీసులు అతని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. తన ఫామ్ లో పని చేస్తున్నప్పుడు ఆ దెయ్యాలు తన దగ్గరికి వచ్చాయని ఈ వ్యక్తి చెప్పడం జరిగింది. PSI Mayanksinh Thakor Pavgadh లో ఆదివారం నాడు డ్యూటీ కి వెళ్ళాడు. అక్కడికి ఇతను వచ్చాడు. అయితే ఇది చాలా క్లియర్ గా ఉంది.

కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు. అప్లికేషన్ తీసుకుని అతనికి చూపించి భయపడొద్దు అని అతనిని మేము కూల్ గా ఉంచామని ఠాకూర్ అన్నారు. పోలీసులు ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను సంప్రదించారు.

అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ జరుపుతున్నట్లు చెప్పారు. అయితే గత పది రోజుల నుంచి తాను మందులు వేసుకో లేదని వాళ్ళు వెల్లడించారు. సోమవారం నాడు పోలీసు మరొకసారి అతనితో మాట్లాడాడు.

పోలీస్ స్టేషన్ నుండి ఆ వ్యక్తి పరిగెట్టి వెళ్ళి పోయాడు. ఆ దెయ్యాలు ఇంకా తనని పట్టిపీడిస్తున్నాయని పారిపోయాడు. పోలీసులు ఆ వ్యక్తిని సరిగ్గా చూసుకోమని కుటుంబ సభ్యులతో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news