గుంటూరులో దారుణం.. బిజెపి నాయకుడి పై దాడి తీవ్ర గాయాలు.. !

-

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిజెపి నాయకుడిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు వినుకొండ బిజేపి పట్టణ కమిటీ అధ్యక్షుడు మేడం రమేష్ ఉదయం వాకింగ్ కు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. చెయ్యి విరగడం తో పాటు తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే తనపై మున్సిపల్ కమిషనర్ దాడి చేయించాడని రమేష్ భావిస్తున్నారు. సురేష్ మహల్ రోడ్డు లో అక్రమమ తొలగింపుల నేపథ్యంలో గతంలో శివాలయాన్ని కూడా కూల్చివేశారు.

అయితే ఆ శివాలయం కూల్చివేతపై రమేష్ కొద్ది రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు నుండి నోటీసులు వచ్చాయి. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కమిషనర్ తనపై దాడి చేయించాడని రమేష్ భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికంగా బిజెపి పట్టణ కమిటీ అధ్యక్షుడి పై జరిగిన దాడి కలకలం రేపుతోంది. బీజేపీ నేతలు కార్యకర్తలు ఈ దాడిని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news