శ్రీ సత్యసాయి జిల్లాలో లారీని ఢీకొట్టింది ట్రావెలర్ టెంపో. ఈ ప్రమాదంలో ఏకంగా 4 గురు మృతి చెందారు. 10 మందికి గాయలు అయ్యాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు కావడం జరిగింది.
మడకశిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ట్రావెలర్ టెంపో వాహనం. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న తరుణంలోనే ఈ సంఘటన జరిగిందట. గుడిబండ మండలం కే ఎన్ పల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా బాధితులను గుర్తించారు పోలీసులు. వాహనంలో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు డ్రైవరు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రేమ్ కుమార్ (30), అతర్వా (2), రత్నమ్మ (70) , మనోజ్ (30) లు ఉన్నారు.