1000 మంది డ్యాన్సర్స్ తో సైరా సెన్సేషన్..!

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరా బరిలో రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో ఓ పాటకి 1000 మంది డ్యాన్సర్స్ తో సాంగ్ కంపోజ్ చేస్తున్నారట.

సినిమాకు ఈ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. 12 రోజుల పాటుగా ఈ సాంగ్ షూట్ చేస్తారట. అంతేకాదు ఈ పాటకి భారీ ఖర్చు పెడుతున్నారట. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ స్థాయిలో ఒక పాటకి ఇంత ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు కూడా హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news