Maha Samudram: ముహూర్తం ఫిక్స్.. మ‌హా స‌ముద్రం టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే..!

-

Maha Samudram:ఏ రంగంలోనై ఓవర్ నైట్ స్టార్ డ‌మ్ తెచ్చుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ, ఒకే ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీలో సార్ట్ డైరెక్ట‌ర్‌గా మారారు. అత‌డే ఆర్ ఎక్స్100 డైరెక్ట‌ర్‌ అజయ్ భూపతి. ఈ చిత్రం ఎలాంటి స‌క్సెస్ సాధించిందో చెప్పావ‌ల్సిన‌వ‌స‌రం లేదు. బోల్డ్ కంటెంట్ ను తన‌దైన శైలిలో తెరకెక్కించి బ్లాక్ బాస్ట‌ర్ హీట్ ను అందుకున్నారు. ఈ మూవీ స‌క్సెస్ త‌ర్వాత అజ‌య్ ఎవరితో సినిమా చేయబోతున్నాడ‌నేది ఇండ‌స్ట్రీలో హ‌ట్ టాఫిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మ‌ల్టీస్టార్లతో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా న‌టిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం అనిల్‌ సుంకర భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే “మహా సముద్రం” నుండి వచ్చిన “హే రంభ”, “చెప్పకే చెప్పకే” అనే పాట‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది. సెప్టెంబర్ 23న ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ చిత్ర యూనిట్. దీంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్న‌ట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ , శరణ్య కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news