టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఎంతో అందం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేపోయింది. దానికి పూనమ్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఘటనలే కారణం అని ఇండస్ట్రీలో టాక్. అయితే పూనమ్ కౌర్ సినిమాలలో రాణించలేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా పూనమ్ కౌర్ ప్రతీ సారి తన ట్వీట్లలో పేరు చెప్పకుండా విమర్శలు కురిపిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి పూనమ్ అదే పనిచేసింది.
ఒక్కసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు..మరి కొన్ని సార్లు మరో అన్న గొప్పగా అనిపిస్తాడు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎవరి ఈగోను వాళ్లు తృప్తి పరుచుకుంటాన్నారే గానీ ఆడవాళ్ల గురించి ఆలోచించేవారెవరున్నారు. మీరంతా మీ ఈగోలను..అజెండాలను గురించి ఆలోచించే స్వార్థపరులు. ఏ ఒక్కరూ కూడా మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు అంటూ పూనమ్ తన ట్వీట్ లో పేర్కొంది. ఇక పూనమ్ చేసిన ఈ ట్వీట్ కు అసలు విషయం చెప్పాలని ఇలా ఏమీ అర్థం కాకుండా పోస్టులు పెట్టవద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.