Rhea chakraborthy: బిగ్ బాస్ ఆఫ‌ర్ రిజెక్ట్: రోజుకు రూ 5. ల‌క్షలిస్తాన‌న్న వ‌ద్ద‌న్న హీరో సుశాంత్ ల‌వ‌ర్ ..

-

Rhea chakraborthy: దేశ‌వ్యాప్తంగా బిగ్ బాస్ షో కు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా.. హిందీ బిగ్ బాస్ గురించి చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. బుల్లితెర చరిత్రలో ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షక ఆద‌ర‌ణ పొందిన‌ నెంబర్ వన్ షో బిగ్ బాస్‌. సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. గతంలో ఎన్నడూ ఏ షోలో చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ల‌తో ఎంట‌ర్టైన్ చేస్తుంది.

ఈ షోకు హోస్టుగా బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సీజ‌న్ కు వంద‌ల కోట్ల రూపాయ‌ల పారితోషికం పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. వారాంత‌పు ఎపిసోడ్ల‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపిస్తే చాలు..టీఆర్పీకి కి రెక్క‌లు వ‌స్తాయంట‌. అందుకే అదే స్తాయితో డబ్బులు చెల్లిస్తు్న్నార‌ట‌.
ఇక ఈ షోలో కేవ‌లం హోస్టుకే కాదు.. కంటెస్టెంట్ల‌కు కూడా భారీ మొత్తంలో రెమ్యూనిరేష‌న్లు అందిస్తున్న‌ట్టు టాక్.

అయితే.. ఇలాంటి ఆఫ‌రే కాదంట హీరో సుశాంత్ ల‌వ‌ర్ రియాచ‌క్ర‌బ‌ర్తి. హిందీలో ప్రారంభ‌కానున్న బిగ్ బాస్ హిందీ 15 సీజ‌న్లో పార్టిసిపేట్ చేయ‌మని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట రియాకు. ఇందుకోసం భారీ మొత్తం అందిమ‌ని నిర్వ‌హ‌కులు తెలిపార‌ట‌. అదికూడా.. రోజుకు ఏకంగా రూ. 5 ల‌క్ష‌ల చొప్పున వారానికి రూ. 35 ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ను ఆఫ‌ర్ చేశార‌ట‌. కానీ ఆ ఆఫ‌ర్ సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌.

అయితే.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సుసైడ్ అనంత‌రం అతని ప్రేయసి రియా చక్రవర్తి ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న మరణానికి కారణం రియానే అంటూ ఆయన అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుశాంత్ డెత్ ఇన్వెస్టిగేషన్ కాస్తా, డ్రగ్ కేసుగా మలుపు తీసుకుంది.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌ను ఎదుర్కొంది. కొన్నాళ్ల పాటు జైల్లో ఉండింది. బెయిల్ పై విడుద‌ల అయ్యింది. ఇలాంటి నేప‌థ్యం ఉన్న రియా .. బిగ్ హౌస్లో కాలు పెడితే.. ప్ల‌స్ అవుతుంద‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు భావించిన‌ట్టుగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news