ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు

-

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు ఇచ్చారు. ఈనెల 06వ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ హైకోర్టు ఈనెల 10 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ విచారణ చేయవచ్చని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కేటీఆర్ కి తాజాగా నోటీసులు ఇచ్చింది.

ముఖ్యంగా ఈనెల 06న కేటీఆర్ హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో.. కేటీఆర్ కోర్టును ఆశ్రయిస్తారా..? లేక విచారణకు హాజరవుతారా..? అనేది సస్పెన్స్ గా మారింది. విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు పంపించింది ఏసీబీ. దీనికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని చెప్పింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికే ఏసీపీ ప్రయత్నిస్తోంది. ఎటువంటి ఆధారాలతో కేసు నమోదు చేశారని ఏసీబీని హైకోర్టు ప్రశ్నించడంతో నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news