Aslem Jarigindi Movie : ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ సినిమాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీరామ్. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. కానీ, ఆయనకు టాలీవుడ్లో కంటే.. కోలీవుడ్ లో అవకాశాలు రావడంతో.. తెలుగు సినిమాలకు దూరమయ్యారు హీరో శ్రీరామ్.. దీంతో కోలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే.. అప్పుడప్పుడూ తెలుగులో ఆడవారు మాటలకు అర్థాలే వేరులే, స్నేహితులు సినిమాల్లో చేసిన సపోర్టింగ్ రోల్స్ మంచి పేరును దక్కించుకున్నాడు.
అయితే చాలా రోజుల తరువాత.. హీరో శ్రీ రామ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోలా వస్తున్నారు.
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా తెరకెక్కుతున్న “చిత్రం అసలేం జరిగింది?”. తెలంగాణలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా.. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడలు ఎక్స్‌డోస్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు.
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో ప్రేమ, సస్పెన్స్, యాక్షన్.. అన్నీ రంగరించి ఉంటాయి. ఈ చిత్రానికి ఎలేందర్ మహావీర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లూక్, పోస్టర్స్, టీజర్స్ లకు ప్రేక్షకుల నుంచి అమితమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ( రేపు) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ కానున్నది.
ఈ తరుణంలో హీరో శ్రీ రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకుడు రాఘవ (ఎన్‌వీఆర్)
ఈ సినిమా కథ చెప్పినప్పుడే.. దాంతో ప్రేమలో పడిపోయాను. ఈ చిత్రం మంచి ప్రాజెక్టు అయినా చాలా పరిమితులున్నాయి. సినిమాలు చేయడంలో ఈ బృందం మొత్తం చాలా ఉత్సాహంగా ఉండి, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తుందని నాకు తెలియడంతో.. ఇందులో చేసి తీరాలని నిర్ణయించుకున్నానని హీరో శ్రీరామ్ తెలిపారు.
గ్రామీణ తెలంగాణలో జరిగిన యద్దార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి తీరాలని. ఈ చిత్రం కోసం టీం మొత్తం చాలా నిజాయితీగా పని చేసింది. అందుకే ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతోందని అన్నారు.