ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డ్ సాధించాడు. 400 వికేట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ చేరారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మార్టిన్ గప్తిల్ వికేట్ తీయడం ద్వారా రషీద్ ఖాన్ ఈ రికార్డ్ సాధించాడు. నాలుగు వందల వికేట్లు తీసిని నాలుగో బౌలర్ గా చరిత్ర స్రుష్టించాడు. అంతకుముందు వెస్టీండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 533 వికేట్లతో తొలిస్థానంలో ఉండగా.. 425 వికేట్లతో వెస్టీండీస్ మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ రెండో స్థానంలో, 420 వికేట్లతో దక్షిణాఫ్రికా స్పిన్నర్ మూడో స్థానంలో ఉన్నారు.
అంతకు ముందు టీ 20 మ్యాచుల్లో అత్యంత వేగంగా 100 వికేట్లను తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ పేరిట రికార్డ్ ఉంది. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరున ఉన్న రికార్డ్ ను రషీద్ ఖాన్ తుడిచేశాడు. లసిత్ మలింగ 76 మ్యాచుల్లో 100 వికేట్లు తీస్తే.. కేవలం 53 మ్యాచుల్లో రషీద్ ఖాన్ ఈ ఫీట్ సాధించాడు.