ఉస్మానియా క్యాంపస్ లో వాకింగ్ కు వెళ్లే వారికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఇకపై వాకింగ్ కు వెళ్లేవారి నుండి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. వాకింగ్ చేయాలంటే ఒక్కో వాకర్ నెలకు రూ.200 కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓయూలో క్రికెట్ గ్రౌండ్, స్విమ్మింగ్ ఫూల్ ను ఉపయోగించుకునే భయటి వ్యక్తుల నుండి యాజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక పై వాకర్స్ నుండి కూడా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక వీసీ తీసుకున్న ఈ నిర్నయాన్ని స్టూడెంట్స్ కూడా స్వాగతిస్తున్నారు.
ఫ్రీగా రావడం వల్ల క్యాంపస్ విలువ తెలియడం లేదని చెబుతున్నారు. కొందరు తమ కుక్కలను తీసుకువచ్చి ఎక్కడ పడితే అక్కడ మల మూత్ర విసర్జన చేయిస్తున్నారని మరికొందరు మద్యం తాగి సీసాలు పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఓయూకు వాకింగ్ వెళ్లే రాజకీయ ప్రముఖుల భద్రత కూడా క్యాంపస్ చూసుకోవాల్సి వస్తుందని దాంతో క్యాంపస్ లో మరిన్ని సదుపాయాలు కల్పిచడం..క్యాంపస్ కు ఎవరు వచ్చి వెళుతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ నిర్ణయం చేశామని చెబుతున్నారు.