ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించింది. జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ తరుణంలోనే.. జడ్చర్ల చైర్‌పర్సన్‌గా కోనేటి పుష్పలత..ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరగగా 27 కౌన్సిలర్ స్థానాలకు 23 బీఆర్ఎస్, చెరో రెండు స్థానాలు బీజేపీ, కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ భర్త పెత్తనం చెలాయిస్తుండడంతో, అందరూ కలిసి దోరేపల్లి లక్ష్మీపై జూలై 25న అవిశ్వాస తీర్మాణం పెట్టి దించిన సంగతి తెలిసిందే. అయితే… ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించగా మెజారిటీ బలం ఉన్న బీఆర్ఎస్ మళ్లీ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో జడ్చర్ల మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ తరుణంలోనే.. జడ్చర్ల చైర్‌పర్సన్‌గా కోనేటి పుష్పలత..ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.